
బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్ ) వెల్లడించింది. ఇది 35 కిమీ (21.75 మైళ్లు) లోతులో సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. కోల్‌కతా నగరం, పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఎత్తైన నివాస సముదాయాలు, రద్దీగా ఉండే మార్కెట్లలో భూమి కంపించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.
దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. స్థానికులు మాత్రం ఇళ్లల్లో సీలింగ్ ఫ్యాన్లు ఊగడం, ఫర్నీచర్ కంపించడం, కిటికీలు కొట్టుకోవడం వంటివి సంభవించాయని చెప్పారు. బహుళ అంతస్తుల భవనాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌గా మారాయి. భారత్‌బంగ్లాదేశ్ సరిహద్దు సమీపం లోని అనేక జిల్లాలపై ఈ భూకంపం ప్రభావం ఉన్నట్టు ఎన్‌సీఎస్ వివరించింది.