
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించిందని, మోదీ పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చే విషయంలో పోటీ పడుతుంటే పేదల ఇళ్లను కూల్చడంలో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు నానా కష్టాలు పడుతూ అప్పోసప్పో చేసి బతకడానికి ఇళ్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని చెప్పారు. తక్షణమే పేదల ఇళ్ల కూల్చివేతను ఆపాలని, లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఆందోళన కార్యక్రమాలు
చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతలు త ప్ప సాధించింది ఏముంది? నానా కష్టాలుపడి పేదలు ఇండ్లు కట్టుకున్నరు. పోనీ ఇల్లు కటే ్టటప్పుడు అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అప్పొసప్పో చేసి బతకడానికి చిన్ని ఇల్లు కట్టుకుంటే ఆ పేదల ఇండ్లను కూల్చడానికి మీకు మనసెలా వచ్చింది? పేదలు ఇండ్లు కట్టుకోవద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టించా మన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేదల ఇండ్లను కూల్చే విషయంలో పోటీ పడుతోందన్నారు.
ప్రభుత్వం “రైతు భరోసా” ఇవ్వడం లేదు : రాష్ట్ర ప్రభుత్వం “రైతు భరోసా” ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారన్నారు.మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా వేస్తామని ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ఇలాంటి హామీలు చాలా ఇచ్చారని మాట తప్పారని, వాస్తవానికి ముఖ్యమంత్రి నోటి నుండి ఏ మాట వచ్చినా శాసనం కావాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు కేసీఆర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారన్నారు. నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేస్తారన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి, రూ.9 వేల కోట్లు రెడీగా ఉన్నాయని పదేపదే చెబుతూ వార్తలు రాయించుకున్నారన్నాని, కానీ ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. అధికారంలోకి వచ్చాక రైతు భరోసా ఒక దఫా ఎగ్గొట్టారన్నారు. ఎన్నికలొ స్తే ఏదో ఒక హామీని తూతూ మంత్రంగా అమలు చేసినట్లు నటించి వార్తలు రాయించు కోవడ, ఆ ఎన్నికలైపోగానే వాటిని మర్చిపోవడం వాళ్లకు అలవాటైందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చే సమయంలో మళ్లీ ఏదో ఒక డ్రామాలాడతారన్నారు. తక్షణమే రైతు భరోసాను చె ల్లించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి : రాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేయకపోయినా, డీఏలు, ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోయినా ఓట్లేశారన్నారు. దీంతో కాం గ్రెస్ నేతల్లో అహంకారం పెరి గిపోయిందన్నారు. ఏ హామీని అమలు చేయకపోయినా ఓట్లే స్తున్నారని చెబుతున్నారన్నారు. అందుకే ఈసారి ప్రజలంతా కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రైతు భరోసా గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదన్నారు.
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటే : కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ ఒక్కటేనని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేశాయని, కలిసే పదవులు పంచుకున్నాయన్నారు. ఇప్పడు ఒకరికి ఒకరు పడనట్లు డ్రామాలాడుతున్నారన్నారు. మరి వాళ్లిద్దరికి ఎక్కడ చెడిందో వాళ్లే చెప్పాలన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు గత ఎన్నికల్లో మాట్లాడారని, మేం కూడా అదే చెప్పామన్నారు. ఈ అంశంపై విచారణ జరిపే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే మేం విచారణ చేపట్టేందుకు సిద్ధమని ఆ మేరకు లేఖ రాయాలని సీఎంను కోరుతున్నానన్నారు.