Reading Time: < 1 minute

రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్- వరల్డ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు వివేక్ ఒబెరాయ్. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఒబెరాయ్ స్టైలిష్ లుక్‌లో కనిపించి తన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతోందో చూపించారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన రాకతో కథలో కొత్త డైనమిక్ చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో ఐశ్వర్య దేశాయ్ ను పరిచయం చేశారు మేకర్స్. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుంది. యానిమల్ సంచలన విజయం తర్వాత నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి బోల్డ్ క్రియేటివ్ విజన్‌తో స్పిరిట్‌ను రూపొందిస్తున్నారు.

ప్రభాస్ కు జోడిగా తృప్తి డిమ్రి కనిపించనున్నారు. భారీ స్థాయిలో, అద్భుతమైన ఎమోషన్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. 8 భాషల్లో విడుదల కానున్న ఈ పాన్- వరల్డ్ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. గుల్షన్ కుమార్ టి సిరీస్ సమర్పణలో, టి-సిరీస్ ఫిలిమ్స్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, ఎడిటింగ్, దర్శకత్వం మొత్తం సందీప్ రెడ్డి వంగా వహిస్తుండగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.