Reading Time: < 1 minute

 వైసిపి మాజీ మంత్రి, ఎపి మండలిలో ప్రతిపక్ష నాయకుడు, బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యా రు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరా బాద్‌కు తరలిం చారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది కూడా ఓసారి బొత్స సత్యనారాయమ అస్వస్థతకు గురుయ్యారు. గతేడాది జూన్‌లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసిపి చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స ఒక్కసారిగా కుప్పకూలిపో యారు.

వెంటనే విశాఖపట్నంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా రు. అంతకుముందు 2013 లో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో కూడా బొత్స చికిత్స తీసుకున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టగా చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఎపిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మండలిలో వైసిపి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్య నారాయణ పార్టీ తరపున కీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ మండలిలో తన వాయిస్ ను వినిపిస్తున్నారు. కట్ చేస్తే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో ప్రస్తుతం మండలి సమావేశాలకు దూరమయ్యే అవకాశం ఉంది.

బొత్స అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను: పవన్ కల్యాణ్

బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను‘ అని తన ప్రకటనలో పేర్కొన్నారు.