Reading Time: < 1 minute

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మృతి పట్ల మాజీ సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌లు సంతాపం వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, ‘చిలుకూరు సౌందరరాజన్’ గా సుపరిచితులైన ఆయన మృతి తమను ఎంతో కలిచివేసిందని వారు పేర్కొన్నారు. చిలుకూరు క్షేత్ర అభి వృద్ధిలో, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేయడంలో సౌందరరాజన్ పోషించిన పాత్ర మరువలేనిదని వారు కొని యాడారు. కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాడటం, దళిత గోవిందం వంటి కార్యక్రమాల ద్వారా సామాజిక సమరసతకు ఆయన కృషి చేశారని వారు గుర్తు చేసుకున్నారు.