
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు రూ. 389 కోట్లు విడుదల చేశారు. ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికల తరువాత అభివద్దే లక్షంగా పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిధులు విడుదలతో పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా ముందుకు సాగనుందని నూతనంగా కొలువుదీరిన సర్పంచ్‌లు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు.