Reading Time: < 1 minute

హైదరాబాద్:   ప్రభాస్ హీరోగా.. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు సందీప్. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఫస్ట్‌లుక్‌ను ఆయన విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వివేక్ చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో తెరపై ఇప్పటివరకూ చూడని సరికొత్త అవతారం ప్రభాస్ మనకు కనిపించనున్నారు. ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పోలీసు కథతో పాటు, మాఫియా నేపథ్యాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. వివేక్ ఓబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటి కాంచన కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొమ్మిది భాషల్లో మార్చి 5, 2027న విడుదల కానుంది.