Reading Time: < 1 minute

హైదరాబాద్: మద్యం స్కామ్ పేరుతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇదే కథ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కారణమైందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై కెటిఆర్ ఎక్స్ లో స్పందించారు. మద్యం కేసులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇవాళ న్యాయం జరిగిందని, తమ లీడర్లపై నమోదైన ప్రతి కేసు రాజకీయ కక్షలో భాగమేనని విమర్శించారు. నిజాలు బయటకు రానంతకాలం కాంగ్రెస్, బిజెపి దుష్ప్రచారాలను చూస్తూనే ఉంటామని తెలియజేశారు. ఏదేమైనా చివరకు న్యాయమే గెలుస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.