Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎపి మాజీ మంత్రి, వైసిపి నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి నుంచి సిటీ న్యూరో సెంటర్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.