Reading Time: < 1 minute

అమరావతి : నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జగదుర్తి వద్ద క్రేన్ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. బెంగుళూరుకు చెందిన ప్రమోద్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి తిరుపతికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తీవ్రంగా గాయపడిన ప్రమోద్ ను ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రమోద్ భార్య, కుమారుడు, కుమార్తె మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.