Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్-8లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించి జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయిత జింబాబ్వే లక్ష్యాన్ని జింబాబ్వే చేధించలేక పోవడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జట్టును అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. 256 పరుగులు చాలా పెద్ద స్కోర్. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యధికం. భారత్ ాగా ఆడింది. టీం ఇండియా ఇదే రిథమ్‌ను కొనసాగించాలి. ఈ టోర్నమెంట్‌లో చక్కటి ప్రదర్శనలు చేసిన జింబాబ్వేకి అభినందనలు’’ అంటూ సచిన్ రాసుకొచ్చారు.