
హోబర్ట్: భారత మహిళ జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ని ఆస్ట్రేలియా మహిళ జట్టు కైవసం చేసుకుంది. హోబర్ట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 36.1 ఓవర్లలో చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో జార్జియా వోల్(101) శతకంతో చెలరేగగా.. లిచ్‌ఫీల్డ్ 80, కీపర్ మూనీ 31 పరుగులతో రాణించారు. భారత బౌలింగ్‌లో కష్వీ గౌతమ్, దీప్తి శర్మ చెరి 2, క్రాంతి గౌడ్ 1 వికెట్ తీశారు. సెంచరీతో ఆసీస్‌ను గెలిపించిన జార్జియా వోల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.