Reading Time: < 1 minute

అమరావతి: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు యువకుడిని కొట్టి చంపారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంధ్య అనే యువతి, సూర్య ప్రకాశ్ అనే యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమ పెళ్లి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో గురువారం అన్నవరంలో సూర్య-సంధ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. సంధ్య అన్నదమ్ములు కోపంతో రగిలిపోయారు. సూర్య ప్రకాశ్ ఇంటికి వెళ్లి అతడిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రస్తుతం రాయవరంలో సంధ్య డిప్యూటీ తాహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.