Reading Time: < 1 minute

స్పోర్ట్స్ స్కూళ్లకు ఆప్లై చేసుకోండి..  నాలుగో తరగతి అడ్మిషన్ కు మార్చి 4 చివరితేది

Caption of Image.

జనగామ అర్బన్, వెలుగు: 2026-27 విద్యా సంవత్సరానికి గాను స్పోర్ట్స్​స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశానికి మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్​వో కోదండరాములు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో ఎంపికైన వారికి జిల్లా స్థాయిలో వచ్చే నెల 28న జనగామ జిల్లాలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు. అర్హులైన విద్యార్థులు https://tgss.telangana.gov.in/ వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఎంఈవోలను సంప్రదించాలని సూచించారు.
 

©️ VIL Media Pvt Ltd.