Reading Time: < 1 minute

చెన్నైలో జింబాబ్వేతో జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీ చేయగా, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా(50: 23 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్స్ లు) అర్థశతకం చేశాడు. తిలక్ వర్మ(44: 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లు), ఇషాన్ కిషన్(38) ,సూర్య కుమార్ యాదవ్(33), సంజు శాంసన్(22) పరుగులు చేశారు.