Reading Time: < 1 minute
Sa Vs Wi South Africa Won By West Indies By 9 Wickets

SA vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్-1లో భాగంగా అహ్మదాబాద్‌ లో సౌతాఫ్రికా వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో జట్టు ఒక దశలో 83/7 వద్ద కష్టాల్లో పడింది. అయితే జాసన్ హోల్డర్ (49), రోమారియో షెఫర్డ్ (52*) అద్భుత పోరాటంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ ను అందించారు. వీరిద్దరి మధ్య 89 పరుగుల భాగస్వామ్యం నమోదు అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు.. రబడా, బోస్చ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బ్యాటర్స్..!

177 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ (Aiden Markram) 46 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ ను వన్ సైడ్ వార్ చేసేశాడు. అతినికి తోడుగా వికెట్ కీపర్, బ్యాటర్ డీకాక్ 24 బంతుల్లో 47 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. డీకాక్ అవుట్ అయ్యాక వచ్జిన ర్యాన్ రికెల్టన్ (45*) తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

India vs Zimbabwe: టీమిండియా కథ మార్చబోతున్న మ్యాచ్.. ఒక్క ఓటమితో ఆ నలుగురి కెరీర్స్ క్లోజ్!

సౌతాఫ్రికా బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విండీస్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. 23 బంతులు మిగిలుండగానే విజయం అందుకున్నారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా దాదాపు సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. భారీ లక్ష్యాన్ని సులభంగా చేధించడం జట్టుకు మంచి నెట్ రన్‌రేట్‌ను కూడా అందించింది. మరోవైపు, వెస్టిండీస్‌కు ఈ ఓటమి గట్టి దెబ్బగా మారింది. అయితే వెస్టిండీస్‌ భారీ తేడాతో ఓడడం భారత్ కు కాస్త ఊరటనిచ్చే అంశం.