Reading Time: 2 minutes
Viral Video Temple Festival Incident In Thrissur Elephant Attacks Priest At Annamnada Mahadeva Temple

Viral Video: కేరళలోని త్రిస్సూర్‌లో ఆలయ ఉత్సవంలో చోటుచేసుకున్న ఓ ఘటన భక్తులను భయబ్రాంతులకు గురి చేసింది. అన్నమనడా మహాదేవ టెంపుల్ లో గురువారం జరిగిన వేడుకల సందర్భంగా ఒక ఏనుగు ఒక్కసారిగా ఆగ్రహించి పూజారిపై దాడి చేసింది. ఆలయ ఉత్సవంలో భాగంగా దేవుడి విగ్రహాన్ని ఏనుగుపై ఉంచే ఏర్పాట్లు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లయితే..

Captaincy On The Edge: ఆ ఐదుగురు కెప్టెన్ల మెడ మీద కత్తులు.. ఒక్క ఓటమి చాలు, కెరీర్ క్లోజ్!

ఉత్సవానికి ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగును ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఒక పూజారిని ఏనుగుపైకి ఎక్కించేందుకు మరో పూజారి సహాయం చేస్తున్నాడు. అదే సమయంలో పక్కనే విగ్రహాన్ని పట్టుకుని నిలబడి ఉన్న మరో పూజారిని ఏనుగు తన తొండంతో అకస్మాత్తుగా ఎత్తి గాలిలోకి విసిరి వేసింది. దీనితో ఆ పూజారి అమాంతం గాల్లో ఎగిరి అమంత దూరంలో నేలపై బలంగా పడ్డాడు. ఈ ఘటనతో అక్కడున్న భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది.

IP66+IP68+IP69 రేటింగ్స్, 10,001mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లేతో లాంచ్ కు సిద్దమైన Realme Narzo Power 5G..!

ఈ ఘటనలో పూజారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన ఏనుగు కాపరి ఏనుగును అదుపులోకి తీసుకువచ్చాడు. దీంతో మరింత ప్రమాదం తప్పింది. గాయపడిన పూజారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.