Reading Time: < 1 minute

ఇజ్రాయెల్లో ప్రధాని బిజీ.. అధ్యక్షుడితో ద్వైపాక్షిక భేటీ.. ప్రతినిధి స్థాయి చర్చలు, ఎంవోయూల మార్పిడి

Caption of Image.
  • యాద్ వషెం స్మారక కేంద్రం సందర్శన
  • భారతీయ ప్రవాసులతో సమావేశం
  • సాయంత్రం స్వదేశానికి రాక

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన రెండో రెజు ఇజ్రాయెల్ పర్యటనలో బిజీగా గడుపుతు న్నారు. నాజీ హింసలో మరణించిన యూదుల స్మారకంగా ఏర్పాటు చేసిన యాద్ వషెం ను ఆయన సందర్శించారు. అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరపుతున్నారు. గురువారం (ఫిబ్రవరి 06) మధ్యాహ్నం 2.40 గంటలకు రెండు దేశాల ప్రధానుల మధ్య ప్రతి నిధి స్థాయి సమావేశాలు జరగనున్నాయి. 

ఈభేటీలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నవోత్తానం అంశాలు కీలకంగా ఉండనున్నా యి. సమావేశాల అనంతరం ఎంవోయూల మార్పిడి, సంయుక్త మీడియా ప్రకటనలు ఉంటాయి.సాయంత్రం 4గంటలకు ఇజ్రాయె ల్లోని భారతీయ ప్రవాసులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 5.50 గంటలకు ఆయన ఢిల్లీకి బయల్దేరనున్నారు. 

రక్షణ, భద్రతా సహకారం ఈ చర్చల్లో ప్రధాన అజెండాగా ఉండనున్న ట్లు సమాచారం. గగనతల రక్షణ వ్యవస్థలపై సహకారం, ఆర్థిక సంబంధాలు, నవోత్తానం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక పె ట్టుబడి ఒప్పందం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందా లకు చాన్స్ ఉంది.

©️ VIL Media Pvt Ltd.