Reading Time: < 1 minute
Sprout Salad Benefits Weight Loss Diabetes Control Recipe Telugu

Sprout salad: మొలకలు (Sprouts) మన ఆరోగ్యాన్ని రక్షించే అద్భుత ఆహారంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తీసుకుంటున్నారు. గింజలను నానపెట్టి మొలకలు తెప్పించడం వల్ల వీటిలోని ఆరోగ్య విలువలు పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ కంట్రోల్‌ ఉండాలనుకునే వారికి మొలకలు మంచివి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శాఖాహారులకు మొలకలు ప్రొటీన్స్ సోర్స్‌గా చెప్పవచ్చు. వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. వీటిలో విటమిన్ A, C, K ,బి-కాంప్లెక్స్ ఉంటాయి.

అయితే, పచ్చి మొలకలు తినడం వల్ల చాలా మంది కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. టేస్ట్ లేకపోవడం, గ్యాస్ సమస్యలు ఎదురుకావచ్చు. ఇలాంటి సమయాల్లోనే మొలకలతో డిఫరెంట్ ఆహారాన్ని ట్రై చేయాలి. రుచితో పాటు ఆరోగ్యం కావాలనుకునే వారికి ‘‘మొలకల సలాడ్’’ మంచి ఆప్షన్. ఇంట్లో ఉండే కూరగాయలతోనే దీనిని రెడీ చేసుకోవచ్చు.

తయారీ విధానం:

ముందుగా మొలకల సలాడ్ కోసం పచ్చి వాటిని స్టీమ్ చేయడం లేకపోతే కొన్ని నిమిషాల పాటు ఉడించాలి. ఇలా చేయడం వల్ల మృదువుగా మారుతాయి.

వీటిలో కీర, టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, బీట్‌రూట్‌లను సన్నగా తరిగి వేసుకోవాలి. కూరగాయాల్ని చేర్చడం వల్ల విటమిన్స్, పీచు పదార్థం మరింత పెరుగుతుంది.

కూరగయాల్ని మొలకలతో కలుపుకోవాలి. దీంట్లోనే కాసింత ఉప్పు, నిమ్మరసం చేర్చుకోవాలి. మిర్చి వాడకుంటే కొద్దిగా మిరియాల పొడిని కూడా చేర్చుకోవచ్చు. వీటిన్నింటిని కలిపిన తర్వాత మొలకల సలాడ్ తయారు అవుతుంది. పచ్చి మొలకలతో పోలిస్తే మొలకల సలాడ్ చాలా సింపుల్‌గా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది శరీర నిర్మాణానికి, ఆరోగ్యానికి, షుగర్ వంటి వ్యాధులు కంట్రోల్ కావడానికి ఎంతో సహాయపడుతుంది.