Reading Time: < 1 minute
Pawan Kalyan Calls On Jana Sena Leaders To Prepare For Local Elections

Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం కావాలని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ్కి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియమించిన సమన్వయకర్తలు, కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సపోర్ట్ టీం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక, రానున్న స్థానిక ఎన్నికల సన్నాహకాలపై దిశానిర్దేశం చేశారు పవన్‌ కల్యాణ్‌… పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా నియమించిన కమిటీలు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధివిధానాలను తెలియచేశారు. ఇక, సార్వత్రిక ఎలక్షన్స్‌లో సాధించిన విధంగానే.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించేలా అంతా కలిసి పనిచేయాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌..