Reading Time: < 1 minute

హైదరాబాద్‌లో భారీ వర్షం వేళ రంగంలోకి హైడ్రా.. కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన

Caption of Image.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా  యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. సాయంత్రం ఆఫీసులు వదిలే సమయానికి నగరంలో సుమారు 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో.. ఎక్కడా వరద నీరు నిలవకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.

ముఖ్యంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ వంతెన కింద లోతట్టు ప్రాంతం కావడంతో ఒక అడుగు మేర నీరు నిలిచింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది 25 హెచ్‌పీ మోటార్లను రంగంలోకి దించి నీటిని వేగంగా తొలగించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టారు.

ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కవాడిగూడతో పాటు జీడిమెట్ల, మూసాపేట, కూకట్‌పల్లి, మూసారంబాగ్, గాజులరామారం ప్రాంతాల్లో హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. వరద కాలువలు, క్యాచ్‌పిట్లు, కల్వర్టుల్లో ఎప్పటికప్పుడు పూడికను తొలగిస్తూ ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

సాయంత్రం 7 గంటల వరకు చెట్లు పడిపోయినట్లు వచ్చిన 9 ఫిర్యాదులపై, అలాగే నీరు నిలిచిందంటూ వచ్చిన 4 ఫిర్యాదులపై కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించి నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా హైడ్రా టీమ్స్ రౌండ్ ది క్లాక్ శ్రమిస్తున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.