
టాలీవుడ్ పర్సెంటేజ్ విధానంపై ప్రస్తుతం తెలుగు ఫిలిం చాంబర్‌లో వాడివేడి చర్చ జరుగుతోంది. డి. సురేష్ బాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. రెవెన్యూ షేరింగ్‌కు సంబంధించి “పర్సెంటేజ్ విధానం”పై ఇరు వర్గాలు తమ వాదనలను వినిపిస్తున్నాయి. సమావేశం ప్రారంభంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సునీల్ నారంగ్, నాగవంశీ వంటి ప్రముఖుల మధ్య వ్యక్తిగత దూషణలు కూడా జరిగినట్టు సమాచారం. దిల్‌రాజు, అల్లు అరవింద్, చెదలవాడ శ్రీనివాసరావు వంటి పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వివాదానికి పరిష్కారంగా పర్సెంటేజ్ విధానంపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీకి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.