Reading Time: < 1 minute

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి: విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Caption of Image.

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ప్రభుత్వ విప్, మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమం’ సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి వివిధ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి కలగకుండా మిషన్ భగీరథ సరఫరాను మెరుగుపరచాలని,  కొత్త బోర్లు, ఫ్లషింగ్ పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వైద్య సేవల్లో నాణ్యత పెంచాలని, పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మందుల కొరత లేకుండా చూడాలన్నారు . ప్రభుత్వ పార్కుల రక్షణ, ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై సమీక్షించారు. 

మరో ప్రజా పోరాటానికి శంఖారావం

మహబూబ్ నగర్ అర్బన్ :  దక్షిణ భారత రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం పాలమూరు గడ్డ నుంచి మరో ప్రజా పోరాటాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని   యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని బృందావన్ క్లాసిక్ గార్డెన్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన  మాట్లాడారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే కుట్రపూరితంగా తీసుకువచ్చిందన్నారు. 

©️ VIL Media Pvt Ltd.