Reading Time: < 1 minute

హైదరాబాద్ సిటీలో సర్ స్పీడప్

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్​జిల్లాలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్​ను అధికారులు వేగవంతం చేశారు. అదనపు కమిషనర్ చంద్రకళ, సివిల్ విజిలెన్స్ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ కలిసి శుక్రవారం కాలనీ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించారు.  మరోవైపు జీహెచ్‌‌‌‌ఎంసీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల ఓట్లను పక్కాగా మ్యాపింగ్ చేస్తూ ఆదర్శంగా నిలవాలని అదనపు కమిషనర్ సత్యనారాయణ సూచించారు. ప్రజల కోసం కేబీఆర్ పార్కు వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి కొత్త ఓట్ల నమోదు, వివరాల సవరణకు అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

©️ VIL Media Pvt Ltd.