Reading Time: < 1 minute

నీడతో పాటు చిరుజల్లులు.. ఆదిలాబాద్‌‌‌‌ నుంచి సాత్నాల వెళ్లే రహదారిలో చెట్ల ప్రత్యేకత

Caption of Image.

మండు వేసవిలో పచ్చటి చెట్ల కిందికి చేరగానే హమ్మయ్య అనిపిస్తుంది. అలాంటి నీడనిచ్చే చెట్లే చిరుజల్లులను సైతం కురిపిస్తే ఆ హాయి మాటలకు అందనిది. ఆదిలాబాద్‌‌‌‌ నుంచి సాత్నాల వెళ్లే రహదారిలో ఉన్న కొన్ని చెట్లు అటువైపు వెళ్లే వారికి అలాంటి అనుభూతినే కలిగిస్తున్నాయి.

స్థానికంగా నిద్రగన్నేరు (రెయిన్‌‌‌‌ ట్రీ, సామేనా సమన్‌‌‌‌)గా పిలిచే ఈ చెట్ల ఆకుల్లోని నీరు ఎండ తీవ్రత కారణంగా ఆవిరిగా మారి జల్లుల రూపంలో కురుస్తాయని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఆ రూట్‌‌‌‌లో వెళ్లే ప్రయాణికులు ఈ చెట్ల కిందికి రాగానే ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నారు.  – వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

©️ VIL Media Pvt Ltd.