Reading Time: < 1 minute

ఏదో ఒక స్కీం పూర్తిగా అమలు చేయాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి

Caption of Image.
  • సర్కారుకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచన 

నల్గొండ, వెలుగు: రైతు భరోసా, బోనస్.. ఏదో ఒక స్కీంను పూర్తిస్థాయిలో అమలు చేయాలని శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రైతు భరోసా ఒకేసారి ఇస్తేనే ప్రయోజనం ఉంటుందని రైతులు అంటున్నారని తెలిపారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో బోనస్ వల్లే లాభం ఉందని చెప్తున్నారన్నారు. శుక్రవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆరోపించారు.

కొత్త అప్పు తేస్తే తప్ప వచ్చే మూడు నెలలు గడిచే పరిస్థితి లేదన్నారు. ఆర్టీసీ సమ్మె, ధాన్యం కొనుగోలు, ప్రాజెక్టుల నిర్వహణ, ఉద్యోగుల సమస్యలు, ఎన్నికల హామీలు డబ్బుతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కార్మికులు సంయమనం పాటించాలని సూచించారు.

కార్మికుడు శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే అని హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ నివేదిక ఆధారంగా కేసీఆర్​ తదితరులపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందని, ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. 

©️ VIL Media Pvt Ltd.