Reading Time: < 1 minute
Nagarjunas Milestone 100th Film King 100 Gearing Up For A Grand Release

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ‘కింగ్ 100’, ‘లాటరీ కింగ్’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ మైల్‌స్టోన్ చిత్రానికి రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా దూసుకుపోతోంది. అంతేకాదు.. షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్టుగా టాక్. త్వరలోనే చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల పై ఫోకస్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరోవైపు మ్యూజిక్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోందట.

వచ్చే నెలలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. అంతేకాదు.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ ల్యాండ్‌మార్క్ మూవీని 2026 దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కానీ, ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి? నాగార్జున లుక్ ఎలా ఉంటుంది? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ, కింగ్ ఈసారి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా సీనియర్ స్టార్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తుండగా.. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌ కలిపి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ టీజర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరి కింగ్ 100తో నాగార్జున ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.