Reading Time: < 1 minute

సంపద పెంచి ప్రజలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యం : డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య

Caption of Image.

యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య తెలిపారు. గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన, మాట్లాడారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులకు వడ్డీలు కడుతూనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ బరిగె రమ్య రాంచందర్, కౌన్సిలర్లు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.