Reading Time: 2 minutes
Actress Laya: జూనియర్ లయ వచ్చేస్తోంది.. సినిమాల్లోకి లయ కూతురు శ్లోక.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఫ్యామిలీ హీరోయిన్’ అని ట్యాగ్ సంపాదించున్న అతి కొద్ది మందిలో లయ ఒకరు. ‘స్వయంవరం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మొదటి సినిమాలోనే అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చకుంది. ‘ప్రేమించు’, ‘మనసున్న మారాజు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘శివరామరాజు’ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అయితే హీరోయి న్ గా కెరీర్ పీక్స్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుందీ అందాల తార. భర్తతో పాఉటు అమెరికాకు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. అయితే పిల్లలు పెద్ద వాళ్లు కావడంతో ఇండియాకు వచ్చేసి సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది లయ. గతేడాది నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిందామె. అందులో హీరోకు అక్కగా నటించి మెప్పించింది. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు తన హిట్ జోడీ శివాజీతో కలిసి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాం పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది.

కాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న లయ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే సందర్భంగా తన కుమార్తె శ్లోక వెండితెర అరంగేట్రం గురించి కూడా మాట్లాడింది. నాలాగే శ్లోకకు నటనపై చాలా ఆసక్తి ఉందని. ఇప్పటికే తను కళలపై పట్టు సాధిస్తోంది. గతంలోనే రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో శ్లోక చిన్న పాత్రలో మెరిసింది. సరైన కథ, మంచి అవకాశం వస్తే కచ్చితంగా నా కూతురును వెండితెరకు పరిచయం చేస్తాను. ప్రేక్షకులు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి’ అని లయ చెప్పుకొచ్చింది.

లయ కూతురు శ్లోక బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

కాగా ఇప్పటకే శ్లోకకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన తల్లి లయతో కలిసి ఆమె చేసే డాన్స్ వీడియోలు, రీల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. దీనికి తోడు శ్లోకకు క్లాసికల్ డాన్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు కూడా లయ కూతురి ఎంట్రీ పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.