Reading Time: < 1 minute

 హైదరాబాద్: వెలుగుమట్ల భూముల్లో పేదలు 2014 నుంచి ఉన్నారని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ భూములపై గతంలో మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని, ప్రజల తిరుగుబాటును చూసి ఆనాడు కెసిఆర్ వెనక్కి తగ్గారని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఆయన మాట్లాడుతూ.. పేదల ఇళ్లను కూల్చడ మొక్కటే సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసింది అని ఈటల విమర్శించారు. వినోభానగర్ ఉన్న వారికి నీరు, విద్యుత్ ఇవ్వాలని గతంలో కోర్టు కూడా చెప్పిందని, సర్వేనంబర్ 148,149లో 62 ఎకరాల భూమి ఉందని తెలియజేశారు. వందలమంది పోలీసులతో తెల్లవారుజాములన వెళ్లి పేదల ఇళ్లు కూల్చారని, లక్షల ఎకరాల్లో ఉన్న అసైన్డ్, భూదాన్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.