Reading Time: < 1 minute

హోబార్ట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళ జట్టు బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో భారత్‌కు ఓపెనర్లు ప్రతీక, స్మృతిలు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి వీరిద్దరు 78 పరుగులు జోడించారు. అయితే అష్లే గార్డ్‌నర్ ఈ భాగస్వామ్యానికి బ్రేక్ వేసింది. అష్లే బౌలింగ్‌లో స్మృతి(31) క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమా(11) త్వరగానే వెనుదిరిగింది. అనంతరం ప్రతీక(52) అర్థశతకం సాధించి రనౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్(54) హాఫ్ సెంచరీ చేయగా, కష్వీ గౌతమ్(25), రిచా ఘోష్ (22), క్రాంతి గౌడ్ (19) ఫర్వాలేదు అనిపించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆసీస్ బౌలింగ్‌లో గార్డ్‌నర్, సదర్‌ల్యాండ్, అలాన కింగ్ చెరి 2, మేగాన్ స్కట్, నికోలా తలో వికెట్ తీశారు. ఇప్పటికే తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.