
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, గ్రామపంచాయతీలకు నిధులను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.745 కోట్లు విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా గత జూన్ మాసం నుంచి ప్రతినెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తున్నారు. గ్రామపంచాయతీలకు 389 కోట్లు విడుదల చేశారు.