
చెన్నై: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్8లో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై భారత జట్టు 72 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 257 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. అభిషేక్ శర్మ(55), హార్ధిక్ పాండ్యా(50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు తిలక్ వర్మ(44), సూర్యకుమార్ యాదవ్(33), ఇషాన్ కిషన్(38), సంజూ శామ్సన్(24) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు సిక్సర్ల మోత మోగించారు. 17 సిక్సర్లు, 17 ఫోర్లు బాదారు. అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో జట్టు భారత్ రికార్డు సృష్టించింది. జింబాబ్వేపై వెస్టిండీస్ 19 సిక్సర్లతో తొలి స్థానంలో ఉంది. టి20 వరల్డ్ కప్‌లో 260 పరుగులతో శ్రీలంక తొలి స్థానంలో ఉండగా 256 పరుగులతో భారత జట్టు రెండో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్ వెస్టిండీస్ పై భారత్ గెలిస్తే సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిపోతే ఇంటికి వెళ్లిపోతుంది.