Reading Time: < 1 minute

బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన నెక్స్ మూవీ ప్రకటనతో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’తో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందిస్తూ బిగ్గెస్ట్ సక్సెస్‌ని నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు. ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం… బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత ఇది అనిల్ రావిపూడి… వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటీవలే ఎంఎస్‌జి చిత్రంలో అతిధి పాత్రలో అదరగొట్టారు వెంకటేష్. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్‌తో ఇది అనిల్ రావిపూడి రెండవ చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి… దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ఈ కొత్త చిత్రాన్ని ఒక క్లీన్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు. అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ స్టయిల్, హాస్యం, భావోద్వేగాలు, వినోదంతో ఈ చిత్రం సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్‌గా నిలవనుంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది. అనిల్ రావిపూడి, సంక్రాంతి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి గుర్తు చేస్తోంది ఈ చిత్రం.