
న్యూఢిల్లీ: ఎన్‌సిఇఆర్‌టి 8వ తరగతి సాంఘిక శాస్తం పుస్తకంలో న్యాయవ్యవస్థలోని అవినీతిపై అవమాన కరమైన అంశాలు ఉన్నందువల్ల ఆ పుస్తకాన్ని సుప్రీంకోర్టు గురువారం నాడు నిషేధించింది. పుస్తకం ప్రచురణ, తిరిగి ము ద్రించడం లేదా డిజిటల్‌గా ప్రచురించడంపై కూడా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ అంశాలను పాఠ్యాంశంగా చేర్చడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీ వ్రంగా స్పందిస్తూ, ‘వారు తుపాకీతో కాల్పులు జరిపారు, న్యాయవ్యవస్థ రక్తం కారుస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకంపై సుమో టో కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యా ఖ్య చేశారు. ఇది న్యాయవ్యవస్థను కించరపచేందుకు జరిగిన దారుణమైన కుట్రగా కోర్టు తీవ్ర పదజాలంతో దుయ్యబట్టింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పుస్తకం కాపీలు అన్నింటినీ వెం టనే స్వాధీనం చేసుకుని, ప్రజల నుంచి తక్షణ మే తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆ దేశించింది. డిజిటల్ పుస్తకాలను తొలగించాల ని స్పష్టం చేసింది. ఈ అధ్యాయం పాఠ్యాంశం గా చేర్చినందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పాఠశాల విద్యాశాఖ తరుపున సొలిసిట ర్ జనరల్ తుషార్ మెహతా బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
న్యాయవ్యవస్థకు కళంకాన్ని ఆపాదించే అవమానకరమైన అధ్యాయాన్ని ప్ర వేశ పెట్టినందుకు బాధ్యులపై ఎందుకు తగిన చర్య తీసుకోకూడదో వివరించాలని సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా, ఎక్స్ ప్లోరింగ్ సొసైటీ- ఇండియా అండ్ బియాండ్ (వాల్యూమ్ 2) అనే పుస్తకం తదుపరి ప్రచురణ, పునర్ముద్రణ లేదా డిజిటల్ వ్యాప్తిపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు సిజేఐ, జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎలక్ట్రానిక్ మాధ్యమం, లేదా కంటెంట్ ఉన్న ప్రత్యామ్నాయ శీర్షికల ద్వారా తమ ఆదేశాన్ని తప్పించుకునే ఎలాంటి ప్రయత్నం చేసినా, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా, సుప్రీం ఆదేశాలను ధిక్కరించినట్లే పరిగణిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాల పుస్తకంలో ఇటువంటి అంశాలు చేర్చడానికి బాధ్యులు ఎవరో కనుక్కోవడం సుప్రీంకోర్టు అధిపతిగా నా విధి అన్ని సిజేఐ అన్నారు. ఈ అంశంలో లొతైన దర్యాప్తు జరపాలని కోరుతున్నట్లు తెలిపారు. సాంఘికశాస్త్రం పాఠ్యపుస్తకంలో ఈ అధ్యాయం ప్రచురించిన విషయాన్ని ఒక వార్తాపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురించినప్పుడు తాము షాక్ తిన్నామని ధర్మాసనం పేర్కొంది.
పత్రికలలో ఆ కథనం ప్రచురించిన తర్వాత కూడా అటువంటి ప్రచురణను ఎన్ సిఇఆర్ టి విడుదల చేసిందో లేదో ధ్రువీకరించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ను కోరినట్లు పేర్కొంది. పుస్తకంలో అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా, ధిక్కారంగా, ఏమి రాయబడిందో ఆత్మపరిశీలన చేసుకోవడానికి బదులు , పుస్తకంలో విషయాలని సమర్థిస్తూ ఎన్ సిఇఆర్ టి డైరెక్టర్ లిఖితపూర్వకంగా స్పందించారని ధర్మాసనం పేర్కొంది. పుస్తకంలోని కంటైంట్ ప్రాథమిక పరిశీలనను, డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రతిస్పందనను కలిపి చదివినప్పుడు న్యాయవ్యవస్థ సంస్థాగత అధికారాన్ని అణగదొక్కేందుకు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరచేందుకు ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమైందని ధర్మాసనం పేర్కొంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వివరణలో ఈ అధ్యాయాన్ని రూపొందించిన ఇద్దరి వ్యక్తులకు మంత్రిత్వశాఖతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. మార్కెట్‌లోకి వచ్చిన 32పుస్తకాలను ఉపసంహరించబడుతున్నాయని, మిగిలిన పుస్తకాలను తాము పంపిణీ చేయడం లేదని, మొత్తం అధ్యాయాన్ని కొత్త బృందం పరిశీలిస్తుందని ఉన్నత న్యాయ అధికారి అన్నారు. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది.