Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. పరిపాలనా అవసరాల దృ ష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 45మంది ఐఏఎలను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంలోని కీలక శాఖల నుంచి జిల్లాల కలెక్టర్ల వరకు అనేక మార్పులు జరిగాయి. మహబూబాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. సంజయ్ కుమార్‌ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేశారు.ఎన్.శ్రీధర్ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. దీంతోపాటు ఆయన మైన్స్, జియాలజీ శాఖ బాధ్యతల్లోనూ కొనసాగనున్నారు.

రాహుల్ బొజ్జ ఇరిగేషన్ శాఖ నుంచి సాధారణ పరిపాలన (రాజకీయ) ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఈయనకు బిసి సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారు. ఆర్థిక, ప్రణాళిక శాఖ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌కు టిజిఎంఎస్‌ఐడిసి ఎండిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ముషారఫ్ అలీ ఫారూఖీ టిజిఎస్పీడిసిఎల్ 3వ కొత్త డిస్కంకు సిఎండిగా నియమితులయ్యారు. జితేష్ వి.పాటిల్, ఐఏఎస్ టిజిఎస్పీడిసిఎల్ సిఎండిగా నియమితులయ్యారు. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దానకిశోర్‌కు విపత్త నిర్వహణ శాఖ బాధ్యతలను ప్రభుత్వం అదనంగా అప్పగించింది. త్వరలో ఈ ఫార్ములా కేసులో సీనియర్ ఐఏఎస్‌ను ప్రాసిక్యూషన్ చేయడానికి డిఓపిటి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అరవింద్ కుమార్‌కు ఎలాంటి శాఖను కేటాయించలేదు. ప్రస్తుతం ఆయన సెలవులలో ఉన్నారు.

దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా ఎం.హనుమంతరావు

మహబూబ్‌నగర్ కలెక్టర్ ఉన్న బి.విజియేంద్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా నియమితులయ్యారు. దివ్య దేవరాజన్ సెర్ప్ సీఈఓగా కొనసాగుతూనే ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మహబూబాబాద్ కలెక్టర్‌గా ఉన్న అద్వైత్ కుమార్ సింగ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సమన్వయ శాఖ (జిఏఐ ప్రాజెక్ట్, సిఎస్‌ఎస్) ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా ఉన్న ఎం.హనుమంతరావును దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయనకు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

నారాయణపేట కలెక్టర్‌గా ఉన్న సిక్త పట్నాయక్ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న సందీప్ కుమార్ ఝా జనగాం కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ కలెక్టర్‌గా ఉన్న పమెలా సత్పతి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న అనురాగ్ జయంతి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. మెదక్ కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్ సహకార శాఖ స్పెషల్ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న భవేష్ మిశ్రా నుంచి అదే శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేట్ అయ్యారు.

జిల్లాల వారీగా బదిలీలు ఇలా..

జనగాం కలెక్టర్గా రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా వెళ్లనున్నారు. జోగులాంబ గద్వాల్ కలెక్టర్ సంతోష్ బిఎం గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. వికారాబాద్ కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ నారాయణపేట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్ కలెక్టర్‌గా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కాత్యాయని దేవి వెళ్లనున్నారు. టిజీఎంఎస్‌ఐడిసి ఎండిగా ఫణీంద్రా రెడ్డి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్న చైత్ర మిశ్రా నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా వెళ్లనున్నారు. ఇక గరీమా అగర్వాల్‌ను రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు. వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి, మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా కష్బూ గుప్తా, హనుమకొండ కలెక్టర్‌గా,

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇండస్ట్రీ, ఇన్వేస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా కె.విద్యాసాగర్, ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం ఎం.సురేందర్‌కు బాధ్యతలు కట్టబెట్టారు. జీహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా మందా మకరందు, మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్, వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉమశంకర్ ప్రసాద్, నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ లాల్, మంచిర్యాల అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, వరంగల్ అదనపు కలెక్టర్‌గా వైవీ గణేశ్, సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా అబ్దుల్ హమీద్, నిర్మల్ అదనపు కలెక్టర్‌గా బి.వెంకటేశ్వర్లు, వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఖీమ్యానాయక్ నియమితులయ్యారు.