Reading Time: < 1 minute
Youtuber Anvesh Issued Lookout Notice By Panjagutta Police Over Controversial Video

Anvesh Lookout Notice: ప్రసిద్ధ యూట్యూబర్‌ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఆ వ్యాఖ్యలు సమాజంలో వివాదాస్పదంగా మారడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రేర్ రికార్డు.. ముగ్గురు స్టార్ బ్యాటర్లు మూడుసార్లు కొట్టేశారు!

ఈ వ్యవహారంపై స్పందించిన పంజాగుట్ట పోలీస్ అధికారులు, అన్వేష్ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉండడంతో దేశంలోకి ప్రవేశించిన వెంటనే అదుపులోకి తీసుకునేలా లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ తన సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసి.. తనకు రెండు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు, రెండు యూట్యూబ్‌ ఛానల్స్‌ ఉన్నాయని వెల్లడించారు. ఇందులో ఆయన ప్రధాన అకౌంట్‌ను ఇంస్టాగ్రామ్ బ్లాక్‌ చేసినట్లు తెలిసింది. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

200MP Camera War: 200MP కెమెరా వార్ మొదలు.. మార్చిలో భారీ ఫ్లాగ్‌షిప్‌లతో రంగంలోకి రెండు దిగ్గజాలు!

ఈ కేసు దర్యాప్తు భాగంగా, అన్వేష్‌కు సంబంధించిన అకౌంట్ల వివరాలు, వీడియోల సమాచారం అందించాలని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థలకు పోలీసులు అధికారికంగా లేఖ రాయనున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో చట్టవిరుద్ధ కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని అధికారులు హెచ్చరించారు.