Reading Time: < 1 minute
Dacoit Release Date Locked Adivi Sesh Pan India Film Set For April 10

Dacoit New Release Date: యువ హీరో అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ముంబై భామ మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ డెరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న డెకాయిట్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

2026 ఉగాదిని పురస్కరించుకుని మార్చి 19న డెకాయిట్‌ సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ముందుగా అనుకుంది. ఆ తేదీనే యష్ ‘టాక్సిక్’, రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ రిలీజ్ అవుతుండడంతో డెకాయిట్‌ వెనక్కి తగ్గింది. తాజా సమాచారం ప్రకారం.. రిలీజ్‌ డేట్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేశారట. ఏప్రిల్ 10 డెకాయిట్‌ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. నిఖిల్ సిద్దార్థ ‘స్వయంభు’ ఓ వారం గ్యాప్ తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. స్వయంభు, డెకాయిట్‌ సినిమాల నైజాం డ్రిస్టిబ్యూటర్ ఏషియన్ సునీల్ కావడంతో.. రెండింటి మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. డెకాయిట్‌ రిలీజ్‌ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Also Read: ENG vs PAK: భారత్‌కే ఐసీసీ సపోర్ట్, ఇది చాలా అన్యాయం.. ఇంజమామ్ సంచలన ఆరోపణలు!

డెకాయిట్‌ నుంచి ఇప్పటికే ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఫస్ట్ సింగిల్‌ ‘రూబరో‌’ను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. గూఢచారి, క్షణం సినిమాలకు పని చేసిన షానియేల్ డియో.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా థ్రిల్లర్ సినిమాలు చేస్తూ వస్తున్న అడివి శేష్.. ఈసారి ప్రేమకథతో వస్తుండడంతో డెకాయిట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.