Reading Time: < 1 minute
Priyanka Chopra Comments On Mahesh Babu Rajamouli Movie Varanasi Ssmb29

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా అంటే కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం (వర్కింగ్ టైటిల్ #Varanasi) గురించి తాజాగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడమే కాకుండా, సినిమాకి ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.

Also Read : Neena Gupta: పెళ్లి కాకుండానే..ఆ క్రికెటర్‌తో బిడ్డను కన్నాను.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

ఒక అంతర్జాతీయ వేదికపై ప్రియాంక చోప్రా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ సినిమా చూసినంత సేపు మనం కాలంలో ప్రయాణిస్తాం, ప్రపంచమంతా చుట్టేస్తాం.. ఇదొక గొప్ప సాహసం (Adventure). ఈ సినిమా చాలా కూల్‌గా ఉండబోతోందని నేను భావిస్తున్నాను. చెప్పాలంటే భారతీయ సినిమా చరిత్రలో ఇదొక నిర్వచనంలా (Defining moment) నిలిచిపోతుంది’ అని తన అభిప్రాయాన్ని పంచుకుంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్‌డమ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రియాంక మాటలు చెప్పకనే చెబుతున్నాయి.

ఈ చిత్రం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్‌గా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి వెల్లడించారు. కథలో భాగంగా టైమ్ ట్రావెల్ లేదా వరల్డ్ టూర్ లాంటి ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని ప్రియాంక వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో, ఇండియన్ ఎమోషన్స్‌తో రాజమౌళి ఈ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా మాటలతో ఈ ప్రాజెక్ట్ పై ఉన్న క్రేజ్ ఇప్పుడు రెట్టింపు అయ్యింది.