Reading Time: < 1 minute
Ahmedabad Jewellery Shop Employee Steals Gold Caught On Camera

ప్రస్తుత కాలంలో ఎవరినీ నమ్మాలో.. ఎవరినీ నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. నమ్మకంగా ఉంటూనే నట్టేట ముంచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నమ్మకంగా ఉంటూనే ఓ నేపాలీ పనిమనిషి.. మాజీ బ్యూరోక్రాటీ భార్యను చంపేశారు. తాజాగా అహ్మదాబాద్‌లో కళ్లు బైర్లు కమ్మే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ జువెలరీ షాపులో సేల్స్‌మెన్ చిరునవ్వుతోనే రూ. 1.5 కోట్ల విలువైన నగలు కాజేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అహ్మదాబాద్‌లో ఓ ప్రముఖ జువెలరీ షాపు అది. ఓ మహిళా సేల్స్‌మెన్ నగల ట్రేలను ఖాళీ చేస్తున్న సమయంలో చిరునవ్వులు చిందిస్తూనే దొరికిన నగలను జేబుల్లోకి వేసుకుంది. తనను ఎవరూ చూడడం లేదన్న భ్రమలో చేతికందిన నగలను దోచుకుంది. రింగులు, గొలుసులు, మంగళసూత్రాలు, పట్టీలు ఇలా వరుసగా బంగారు వస్తువులను జేబులో వేసుకోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇటీవల ఉంగరాలు, గొలుసులు, మంగళసూత్రాలు, కాలి గజ్జెలు కనిపించకుండా పోయినట్లు తేలడంతో సీసీకెమెరాలను పరిశీలించగా ఈ బండారం బయటపడింది.

వెంటనే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలిస్తున్నారు. నిందితురాలైన మహిళ గత 11 నెలలుగా షోరూమ్‌లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు.