Reading Time: < 1 minute
Nbk Koratala Siva Movie Update Mafia Don Flashback Release Date

NBK-Koratala Siva: టాలీవుడ్‌లో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామా పట్టాలెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సినీ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాలో సెకండాఫ్ హైలైట్‌గా నిలవబోతుందని టాక్. ముఖ్యంగా కొరటాల శివ బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఫ్లాష్‌బ్యాక్ డిజైన్ చేశారట. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఇందులో బాలయ్య ఊరమాస్ అవతార్‌లో కనిపిస్తారని సమాచారం. భారీ మాస్ సీక్వెన్స్‌లతో పాటు, ఆ పాత్ర చుట్టూ ఉండే బలమైన డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఇన్‌సైడ్ వర్గాల టాక్.

ఈ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించబోతున్నారట. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్‌తో పాటు, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో, కథ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కీ రోల్ పోషించనున్నాయని తెలుస్తుంది. ఒక విలక్షణమైన కథాంశంతో, పూర్తిస్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించేందుకు కసరత్తులు జరుగుతున్నాయని సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మే 1న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బాలయ్య తన 111వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే కొరటాల శివ ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.