Reading Time: < 1 minute

వేములవాడ ఆర్టీసీ సమ్మెలో సొమ్మసిల్లిన కండక్టర్

Caption of Image.

వేములవాడ, వెలుగు: వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మెలో పాల్గొన్న మహిళా కండక్టర్‌‌  అస్వస్థతకు గురయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు వేములవాడ డిపో ఎదుట శుక్రవారం చేపట్టిన నిరసనలో సిరిసిల్లకు చెందిన మహిళా కండక్టర్ రమాదేవి పాల్గొన్నారు. 

ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయారు. అక్కడే ఉన్న తోటి కార్మికులు అప్రమత్తమై సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.