Reading Time: < 1 minute

అలైడ్ సైన్సెస్ విద్యార్థులే  వైద్య రంగానికి వెన్నెముక..గాంధీ మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు

Caption of Image.
  • గాంధీ మెడికల్ కాలేజీ  ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ అలైడ్ సైన్సెస్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర మాట్లాడుతూ.. అలైడ్ సైన్సెస్ విద్యార్థులు వైద్య రంగానికి వెన్నెముక వంటివారని, డాక్టర్లు, రోగుల మధ్య వీరు ఒక బలమైన వారధిగా నిలవాలని ఆకాంక్షించారు.

మూడు సంవత్సరాల కోర్సులో భాగంగా వివిధ విభాగాల్లో చేరిన విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉత్తమ సేవలందించాలని పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాజారావు, అనాటమీ హెచ్​ఓడీ డాక్టర్ సుధారాణి, ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ బాబు, అనస్తీసియా ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.