ఇండోర్ ప్లాంట్స్ : ఎండ వేడి, ఉక్కపోత నుంచి బయటపడి, మీ ఇంటిని చాలా చల్లగా మార్చాలి అనుకుంటే తప్పకుండా ఇంటిలో మొక్కలు పెంచుకోవాలంట. ముఖ్యంగా మనీ ప్లాంట్ , స్నేక్ ఫ్లాంట్ మొక్కలను ఇంటిలో పెంచుకోవడం వలన ఇవి గాలిని శుద్ధి చేసి, ఆరోగ్యానికి దోహదపడటమే కాకుండా ఇంటిని చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువలన తప్పకుండా ఈ మొక్కలను ఇంటిలో పెంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
పలచని కర్టెన్స్ , ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలి అంటే తప్పకుండా ఇంటిలో పలచటి కర్టన్స్ వాడాలి. సూర్యరశ్మితో పాటు సహజ గాలి ప్రసరణ గదులలో వ్యాపించాలి అంటే పలచని కర్టెన్స్ ఇంటిలో ఉంపయోగించాలి. దీని వలన గది చాలా చల్లగా ఉంటుంది. వీటి వలన వేడి లోనికి రాకుండా ఉండటమే కాకుండా, గదికి కూడా మంచి లుక్ వస్తుంది. అందువలన సమ్మర్లో వీలైనంత వరకు పలచటి, కాటన్ కర్టన్స్ ఉపయోగించాలంట.
లేత రంగు బెడ్ షీట్స్, డోర్ కర్టెన్స్ ఉపయోగించడం. మీ గది చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉండాలి అంటే తప్పకుండా ఇంటిలో లేత రంగు కాటన్ షీట్స్ లేదా బెడ్ షీట్స్ ఉపయోగించాలంట. ముఖ్యంగా తెలుపు, పుసుపు రంగు వంటి వాటిని ఉపయోగించడం వలన గది వాతావరణం చాలా చల్లగా ఉంటుందంట. అంతే కాకుండా బయట ఎంత వేడి ఉన్న ఇంటిలో వేడి తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
అదే విధంగా ఇంటిలో వేడి తగ్గాలి అంటే తప్పకుండా లైటింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ఎక్కువ వెలుగునిచ్చే, ప్రకాశవంతమైన లైట్స్ ఇంటిలో వేడిని పెంచుతుంది. అందువలన ఇంటిలో ఉన్న ఇన్కాండిసెంట్ వంటి బల్బులను తీసివేసి వాటి స్థానంలో ఎల్ ఈ డీ బల్బులను అమర్చాలంట. దీని వలన ఇంటిలో వేడి తగ్గి, ఇల్లు సహజ వాతావరణంలో ఉంటుందంట.
అదే విధంగా ఇంటిలో ఉన్న పాత వస్తువుల, చాలా బరువైన వాటిని తొలిగించడం కూడా చాలా మంచిది. దీని వలన గది మొత్తం విశాలంగా కనిపించడమే కాకుండా, చల్లగా ఉంటుందంట. ముఖ్యంగా ఎప్పుడూ కూడ వేసవిలో గదిని మొత్తం వస్తువులతో నింపకూడదు. అందువలన అనవసరమైన వస్తువులను తొలిగించి ఆ ప్రదేశంలో మొక్కలను నాటుకోవాలి. ఇది ఆరోగ్యానికి, మంచిది.




