
ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు చిన్నా. కేవలం సహాయక పాత్రలే కాదు హీరోగా, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నాడు నటుడు చిన్నా.. ప్రస్తుతం ఆయన సీరియల్స్ తో డీజీగా ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చిన్న ఇప్పుడు సీరియల్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో చిన్నా తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, పలువురు ప్రముఖ నటులతో తనకున్న వ్యక్తిగత అనుబంధాలను పంచుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత, కే.ఎస్. రామారావు బలవంతం మీద ఫిలిం నగర్ క్లబ్‌లో సభ్యత్వం తీసుకున్నానని చిన్నా తెలిపారు. సాధారణంగా షూటింగ్ తర్వాత తన ఇల్లు, కుటుంబానికే పరిమితమవుతానని, పబ్‌లు, నైట్‌క్లబ్‌లకు, డ్యాన్సింగ్ పబ్‌లకు తాను దూరంగా ఉంటానని తెలిపారు. శివాజీ రాజా, శుభలేఖ సుధాకర్, సురేష్ వంటి వారితో ఇప్పటికీ స్నేహం కొనసాగుతుందని, సుధాకర్ తన పుట్టినరోజున తప్పకుండా ఫోన్ చేస్తారని చిన్నా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
హీరోలతో అనుబంధం గురించి చిన్నా మాట్లాడారు. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి అందరు స్టార్ హీరోలు బాగా ఉండేవారని, అయితే నాగార్జున స్వతహాగా కాస్త రిజర్వ్‌డ్‌గా ఉంటారని చిన్నా తెలిపారు. బాలకృష్ణ మాత్రం చాలా జోవియల్‌గా, చిన్న పిల్లాడిలా ఉంటారని చిన్నా ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాలకృష్ణతో జరిగిన ఒక మర్చిపోలేని సంఘటనను ఆయన వివరంగా చెప్పారు. బ్రాహ్మిణి వివాహ కార్డులు ఎంపిక చేయడానికి బాలకృష్ణ వస్తుండగా, చిన్నా షూటింగ్ కోసం వస్తున్నారని, ఇద్దరికీ ఫస్ట్ క్లాస్ కూపే టికెట్లు దొరకలేదని తెలిపారు. వైజాగ్ ఎంపీ జనార్దన్ రెడ్డి పీఏ ద్వారా ఎంపీ కోటాలో టికెట్లు అలాట్ చేయించుకుని, ఇద్దరూ ఒకే కూపేలో ప్రయాణించాం అని చిన్నా తెలిపారు. రైలులో బాలకృష్ణ దేవుడి ఫోటోలు పెట్టుకోవడం, రాజమండ్రి వద్ద ప్రొడ్యూసర్ కొండా కృష్ణంరాజు పంపిన ఫుడ్ క్యారియర్‌తో విందు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: ఎంత పని చేశావ్ సామి..!! రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాకు నో చెప్పిన నటుడు..
ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేలో అటెండర్ ఉన్నప్పటికీ, బాలకృష్ణ స్వయంగా తన ప్లేట్‌ను వాష్ చేసి, డస్ట్‌ను డస్ట్‌బిన్‌లో వేయడం చిన్నాను ఆశ్చర్యపరిచిందట. రైలులో పడుకునే విషయంలో కూడా బాలకృష్ణ నిరాడంబరతను చిన్నా ప్రస్తావించారు. తనకు ఒక 3:30 గంటలకు మెలుకువ వచ్చి చూస్తే, బాలకృష్ణ తన కాళ్ల దగ్గర కూర్చొని పంచాంగం చదువుతున్నారని, అది చూసి తాను షాక్ అయ్యానని చిన్నా తెలిపారు. ఉదయాన్నే లేచే అలవాటు లేదని బాలకృష్ణ చెప్పినప్పటికీ, ఆయన ఆ విధంగా చేయడం చిన్నాను ఎంతగానో ఆకట్టుకుంది. ఉదయం 6:30 గంటలకు మౌలాలి రాగానే, బాలకృష్ణ చిన్నాను మెల్లగా లేపి, సామాను సర్దుకోమని చెప్పడం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాక, మధ్యాహ్నం బాలకృష్ణ ఫోన్ చేసి, సాయంత్రం తినడానికి ఏం తెస్తావని అడిగారని చిన్నా చెప్పారు. అప్పటికే తన భార్య పాయా, పరోటా సిద్ధం చేయగా, వాటిని బాక్స్‌లో తీసుకువెళ్లానని, బాలకృష్ణ వాటిని చాలా ఇష్టపడి తిన్నారని తెలిపారు. తిన్న తర్వాత తన భార్యకు ఫోన్ చేయమని అడిగి, “అమ్మా, తల్లి, అద్భుతంగా చేశావమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా” అని అభినందించారని చిన్నా గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ నిజంగా గొప్ప మనిషి అని, ఆయన చాలా జోవియల్‌గా ఉంటారని, ప్రేమ ఎక్కువ ఉన్నవారికి కోపం కూడా ఎక్కువే ఉంటుందని చిన్నా వ్యాఖ్యానించారు.