
బీఆర్ఎస్నుంచి తెగతెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీని పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ ఎస్) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఏప్రిల్ 25, 2026 శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సభలో పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. పసుపు, నీలం, తెలుపు రంగులతో TRS పార్టీ జెండా రూపుదిద్దుకుంది.
కవిత ప్రకటించిన టీఆర్ఎస్.. TRS.. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ జెండా విడుదల అయ్యింది. TRS జెండాలో మూడు రంగులు ఉన్నాయి. పసుపు, నీలం,తెలుపు రంగులు.పసుపు రంగులో జెండా మొత్తం ఉంటే.. అందులో తెలంగాణ రాష్ట్ర మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ నీలం రంగులో ఉంది. TRS అనే అక్షరాలు తెలుపు రంగులో ఉన్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. గతంలో తన తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తరహాలోనే కవిత కూడా తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా తన పార్టీ పేరు నామకరణం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.