Reading Time: < 1 minute

పాపన్నపేట మండలంలో ఫెయిల్ అవుతాననే భయంతో టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

Caption of Image.

పాపన్నపేట, వెలుగు: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఎస్సై శ్రీనివాస్​గౌడ్​ తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌‌పల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ(17) కొత్తపల్లి హైస్కూల్​లో పదో తరగతి చదివి ఇటీవల పరీక్షలు రాసింది. పరీక్షలు అయిపోయినప్పటి నుంచి ఆమె దిగులుగా ఉంటోంది. 

పరీక్షలు సరిగా రాయలేదని, ఫెయిల్ అవుతానేమోనని తల్లిదండ్రులకు చెప్పింది. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయిప్రియ ఫ్యాన్‌‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

©️ VIL Media Pvt Ltd.