Reading Time: < 1 minute
Tdp Ysrcp Verbal Clash Legislative Council Session Adjourned

TDP vs YSRCP Clash: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో తీవ్ర గందరగోళం కొనసాగుతుంది. సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకు మళ్ళీ వాయిదా పడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పూర్తి కాకుండానే మరో ప్రశ్నకు వెళ్లడంపై మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలు ఉంటాయి.. ఒక ప్రశ్నకు సమాధానం పూర్తి కాకుండానే మరో ప్రశ్నకు వెళ్ళటం సరికాదన్నారు. ఇరిగేషన్ మంత్రి ఉపన్యాసంతో మాకు అభ్యంతరం లేదు.. ఆయన ఏదో చెప్పుకున్నారు.. రేవంత్ రెడ్డి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నారా లేదా అనే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని బొత్స డిమాండ్ చేశారు.

Read Also: Arjun Tendulkar Wedding: జామ్‌నగర్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక వివాహ వేడుకలు.. వీడియో వైరల్

ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. రాయతసీమకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారు అంటూ వైసీపీ సభ్యులు ఆరోపణలు చేయగా.. ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం వైఎస్ జగన్ చేశారని తెలుగు దేశం పార్టీ సభ్యులు కౌంటర్ ఇచ్చారు. దీంతో పోటా పోటీగా వైసీపీ, కూటమి సభ్యుల నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితులతో సభను మండలి చైర్మన్ వాయిదా వేశారు.