Reading Time: < 1 minute
Suriya Vishwanath And Sons Release Date August Independence Day Weekend

Suriya: యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకు సోషల్ మీడియాలో లేటెస్ట్‌గా వైరల్ అవుతున్న ఒక వార్త ఇప్పుడు సూపర్ కిక్ ఇస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ ఆగష్టు 14న సినిమాను రిలీజ్ చేస్తే, లాంగ్ వీకెండ్ (స్వాతంత్ర దినోత్సవం, వారాంతపు సెలవులు) కలిసి వస్తుందని, దీంతో భారీ వసూళ్లను రాబట్టవచ్చని చిత్ర యూనిట్ స్కెచ్ వేసినట్లు సమాచారం.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్, సూర్య పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే రిలీజ్ తేదీపై ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే, ఆగష్టులో థియేటర్ల వద్ద సూర్య హంగామా మొదలైనట్టే..