Reading Time: < 1 minute
Jagapathi Babu Comments On Ram Charan Peddi Movie Role

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ రామ్ చరణ్ లుక్ పై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆయన స్పందిస్తూ.. మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని, ముఖ్యంగా తన పాత్రను దర్శకుడు బుచ్చిబాబు డిజైన్ చేసిన విధానం చూసి తనే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు.

‘నా క్యారెక్టర్ ఇంత డిఫరెంట్‌గా ఉంటుందని నేను కూడా ఊహించలేదు’ అని జగ్గు భాయ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో, సినిమాలో ఆయన రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో జగపతి బాబు మెయిన్ విలన్‌గా, కథను మలుపు తిప్పే అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నారట. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ – జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.